చంద్రబాబు అరెస్ట్ కక్షసాధింపే..: పవన్ కల్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ మండిపడ్డారు.గతంలో విశాఖపట్నంలోనూ తమ పట్ల ఈ విధంగానే ప్రవర్తించారని పేర్కొన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేయడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని వెల్లడించారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..