ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్

ఇసుక పాలసీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఏపీఎండీసీ డైరెక్టర్ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.కాగా ఈ ఇసుక పాలసీ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3 గా చింతమనేని ప్రభాకర్, ఏ4 గా దేవినేని ఉమ ఉన్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Lorem Ipsum Dolor Sit Amet