సీఎం జగన్‎పై చంద్రబాబు మండిపాటు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీసీల పొట్టగొట్టి జగన్ తన పొట్ట పెంచుకుంటున్నారని విమర్శించారు.

పేరుకే బీసీలకు కొన్ని పదవులు.పెత్తనమంతా అగ్ర కులాలకేనని మండిపడ్డారు.

మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ఆరోపించారు.టీటీడీలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా మూడు పదవులు మాత్రమే ఇచ్చారన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలను వెతుక్కుంటూ వచ్చి పదవులు ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కొడుకులతో ఆటోలో ప్రయాణం చేస్తూ చిల్ అవుతున్న నయనతార.. వీడియో వైరల్!