ఏపీకి బాబు ఇక అతిథి ? మొత్తం ‘జూమ్ ‘ నుంచే ?

ఒకవైపు వయసు పైబడటం, మరోవైపు కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

మామూలుగా అయితే చంద్రబాబు క్షణం తీరిక లేనట్లుగా నిత్యం బిజీ బిజీగా గడుపుతూ ఉంటారు.

పార్టీ శ్రేణులతో అన్ని విషయాలపైన ఆరా తీస్తూ పార్టీ బలోపేతంపై ఆలోచిస్తూ ఉంటారు.

రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకుంటూ అక్కడ పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తూ, అధికార పార్టీని ఏ విధంగా చిక్కుల్లో పెట్టాలి అనే విషయం పైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు.

మామూలు రోజుల్లో చంద్రబాబు ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పడే విధంగా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఉండేవారు.

కానీ ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు.దీంతో ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ లో ఉన్నా, చేసేది ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.

లాక్ డౌన్ విధించక ముందు హైదరాబాదులో ఉండిపోయిన ఆయన దాదాపు రెండు నెలల పాటు తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వచ్చారు.

ఇక విశాఖలో ఎల్ జి పాలిమర్స్ దుర్ఘటన జరిగిన సమయంలో చంద్రబాబు ఏపీకి వచ్చేందుకు ప్రయత్నించినా, ఆరోగ్యరీత్యా అక్కడకు వెళ్లడం శ్రేయస్కరం కాదు అనే ఉద్దేశంతో ఆగిపోయారు.

కొద్ది రోజుల క్రితం విశాఖ కు వెళ్లే నిమిత్తం అన్ని అనుమతులు తీసుకుని ఆయన ఏపీకి వచ్చారు.

కానీ అక్కడకు వెళ్ళకుండా అమరావతిలోనే ఉండిపోయారు.అక్కడే పార్టీ మహానాడు ను నిర్వహించారు.

"""/"/ తర్వాత హైదరాబాద్ కు వెళ్లిపోయారు.ఇక హైదరాబాద్ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

తాను మళ్ళీ ఏపీకి వచ్చినా, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చుట్టుముడతారని, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఇది అంత మంచిది కాదని, అలాగే నిబంధనలు కూడా ఉల్లంఘించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఇక ఎక్కువ భాగం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, అక్కడి నుంచి సలహాలు సూచనలు అందించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏపీలో ఆయన లేకపోతే విమర్శలు తప్పకుండా వస్తాయి.గతంలో వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉండగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉంటూ ఏపీకి పార్టీ కార్యక్రమాలు ఉన్న సమయంలో మాత్రమే వచ్చేవారు.

ఈ విషయంపై అప్పట్లో చంద్రబాబు విమర్శలు చేశారు.ఇప్పుడు చంద్రబాబు అదే బాటలో వెళ్లాలని డిసైడ్ అవ్వడంతో అధికార పార్టీ నుంచి అదే స్థాయిలో విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

బంగాళదుంప తొక్కలు పారేస్తున్నారా.. వాటితో ఇలా చేస్తే మీ జుట్టు డబుల్ అవుతుంది!