రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలియజేయడం జరిగింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు."రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం.

క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం.అయితే నేడు మీ ఆగ్రహం.

ధర్మాగ్రహం కావాలి.ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. """/" / ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ.

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు".అని పేర్కొన్నారు.

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో చంద్రబాబు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు.

"ప్రజాగళం</em( Prajagalam )" పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.ఎట్టి పరిస్థితులలో ఎన్నికలలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో బీజేపీ, టీడీపీ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.2014 మాదిరిగా 2024 ఎన్నికలలో( 2024 Elections) గెలిచే విధంగా చంద్రబాబు వ్యూహాలు చేస్తున్నారు.

దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు.ఇదే సమయంలో ప్రజలకు పలు హామీలు ప్రకటిస్తున్నారు.

చిరంజీవి కి భారీ సక్సెస్ ఇవ్వడం శ్రీకాంత్ ఓదెల వల్ల అవుతుందా..?