బాలయ్యతో బావయ్య కు ఇబ్బందులేనా ? 

తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠంపై చంద్రబాబు తర్వాత ఎవరు కూర్చుంటారు అనే విషయం పై ఇప్పటి నుంచే చర్చ, హడావుడి మొదలైపోయింది.

పదేపదే లోకేష్ ప్రస్తావన వస్తున్నా, ఆయనను మాత్రం మెజారిటీ తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తుండడంతో , మరో ఆప్షన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై చంద్రబాబు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా, పార్టీ భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకున్నా చంద్రబాబు మాత్రం లోకేష్ కాకుండా మరొక పేరును అయితే ఎంపిక చేయరు అని విషయం అందరికీ తెలిసిందే.

కాకపోతే అవకాశం వస్తే మాత్రం ఆ పదవిని దక్కించుకునేందుకు చాలామంది ఆశావాహులు ఎదురు చూడటమే కాకుండా, అప్పుడే పోటీ పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇటీవలే బాలకృష్ణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడంతో పాటు, టీడీపీ అధ్యక్ష బాధ్యతలు విషయం పైన చర్చకు రావడంతో,  తాను ఆ పదవికి పోటీ పడడం లేదని, తనకు ఇమ్మని అడగనని, ఇస్తే ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తాను అర్హుడని అంటూ బాలయ్య మాట్లాడారు.

దీన్ని బట్టి చూస్తే బాలయ్యకు అధ్యక్ష స్థానం పై కన్ను ఉంది అనే విషయం స్పష్టమైంది.

అసలు పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ వారసుడిగా తనకు పార్టీలో పెద్దపీట వేయాల్సి ఉన్నా, ఎమ్మెల్యే తోనే సరిపెట్టడం, పార్టీ ఓడిన తర్వాత నియమించిన పార్టీ పదవుల్లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించడం ఇవన్నీ తన స్థాయికి తగ్గ పదవులు కాదు అనేది బాలయ్య అభిప్రాయంగా కొంతమంది ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

"""/"/ అయితే ముందు ముందు టిడిపి కి మరిన్ని ఇబ్బందులు ఎదురైనా,  చంద్రబాబు యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేకపోయినా, లోకేష్ కాకుండా ఆస్థానంలో బాలయ్య కూర్చునేందుకు వెనకాడరు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

మొన్నటి వరకు కాస్త సైలెంట్ గానే ఉన్న బాలయ్య ఇప్పుడిప్పుడే పార్టీలో కీలక స్థానాల్లో తాను కూర్చునేందుకు అర్హుడని అన్నట్లుగా సంకేతాలు ఇస్తూ ఉండడం చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తోందట.

మళ్లీ జనంలోకి ఏపీ సీఎం జగన్..!