నిజం గెలిస్తే జీవితాంతం చంద్రబాబు జైల్లోనే..: మంత్రి రోజా

నిజం గెలవాలనే తాము కూడా కోరుకుంటున్నట్లు వైసీపీ మంత్రి రోజా అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టనున్న నిజం గెలవాలి పేరిట బస్సు యాత్రపై రోజా స్పందించారు.

నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉంటారని మంత్రి రోజా తెలిపారు.చంద్రబాబు కుమారుడు, సతీమణి కూడా లోపలికి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు.

నిజం గెలవాలని భువనేశ్వరికి ఉంటే సీబీఐ విచారణ కోరాలని తెలిపారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై సీబీఐ విచారణ జరిపిస్తే నిజం గెలుస్తుందని సూచించారు.

సినిమా ఫ్లాప్ అయిన సమయంలో పార్టీ చేసుకుంటాను.. చరణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!