అంగన్వాడీ దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో అంగన్వాడీల దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యలు( Problems Of Anganwadis ) పరిష్కరించాలని.ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.ఇదే సమయంలో తాము అధికారంలోకి రాగానే అన్ని విధాల అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

"""/" / దాదాపు రెండు వారాలకు పైగా అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేస్తూ ఉన్నారు.

నేడు 18వ రోజు.కూడా దీక్ష సాగింది.

18 రోజుల నుంచి నిరసనలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచాలని న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఉన్నారు.

  ఇదిలా ఉంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా సమ్మె కొనసాగిస్తామని యూనియన్ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు అంగన్ వాడీ యూనియన్ సంఘాలు చర్చలు జరిపాయి.అయితే వేతనాల పెంపు విషయంలో.

రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూలమైన నిర్ణయం రాకపోవడంతో.సమ్మె సాగుతూ ఉంది.

వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!