మంత్రి గారి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు వార్నింగ్
TeluguStop.com
గత వైసిపి ( YCP )ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలన సాగించేలా, గతంలో వ్యవహరించినట్టుగా కాకుండా పూర్తిగా ప్రజలతో మమేకం అవుతూ , జన రంజక పాలన అందించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ముందడుగు వేస్తుండగా, ఆయన ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు, అధికారుల వ్యవహార శైలి కారణంగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తాజాగా చంద్రబాబు క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత రెడ్డి( Haritha Reddy ) పోలీసులతో వ్యవహరించిన తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడిన తీరును చంద్రబాబు తప్పుపట్టారు. """/" /
మరోసారి ఈ విధమైన పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకోబోనని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి( Minister Ramprasad Reddy ) ఫోన్ లో చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడంతో పాటు, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం.
రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్ గా రావాలంటూ హరిత రెడ్డి వాగ్వాదానికి దిగారు.
పెన్షన్లు పంపిణీకి వెళ్లేందుకు పోలీస్ కాన్వాయ్ కావాలంటూ ఆమె డిమాండ్ చేశారు .
స్థానిక ఎస్ఐ రమేష్ ( SI Ramesh )ఆలస్యంగా రావడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాన్ఫరెన్స్ లో ఉన్నానని ఎస్ఐ రమేష్ చెప్పగా సిఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటంటూ ఎస్ఐపై ఆమె సీరియస్ అయ్యారు.
అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత పోలీసులతో దురుసుగా మాట్లాడిన తీరుపై అనేక విమర్శలు వ్యక్తం అయ్యాయి.
"""/" /
ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడం, టిడిపి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో, స్వయంగా చంద్రబాబు ఈ విషయంలో కలుగ చేసుకుని మంత్రికి వార్నింగ్ ఇచ్చారు .
ఉద్యోగుల పట్ల గౌరవంగా మసులుకోవాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని చంద్రబాబు మంత్రికి సూచించారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఇకపై ఉపేక్షించేది లేదని , ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రికి వార్నింగ్ ఇచ్చారు.
నందమూరి రామ్ సినీ ఎంట్రీ పై నారా భువనేశ్వరి ట్వీట్..డైరెక్టర్ స్పందన ఇదే?