పవన్ కోసం బాబు తహతహ.. రీజన్ ఇదే..!
TeluguStop.com
వంద సార్లు తిట్టినా ఫర్లేదు కానీ.ఒక్క బొబ్బట్టు చాలు.
`` అన్నాట్ట.వెనకడికి ఒకడు! ఇప్పుడు ఏపీ అధికార పార్టీ టీడీపీ పరిస్థితి కూడా అలానే ఉంది.
రాజకీయంగా వారికి ఇప్పుడున్న పరిస్థితులు వచ్చే ఎన్నికల సమయానికి తలకిందులు అయితే, పరిస్థితి ఏంటి? మళ్లీ అధికారం దక్కకపోతే ఏం చేయాలి? వంటి విషయాలు వాళ్లను తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే రాజకీయంగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటినీ వినియోగించుకుని.విజయం సా ధించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే మళ్లీ పవన్‌తో జట్టుకట్టేందుకు రెడీ అయ్యారు.నిజానికి పవన్ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశాడు.
అవినీతి పెరిగిపోయిందని, అవినీతి విచ్చలవిడి అయిపోయిందని ఆరోపించాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
చిన్నబాబు లోకేష్ అవినీతి పరులతో అంటకాగుతున్నాడని కూడా పవన్ చెప్పుకొచ్చారు.
తాను మద్దతు ఇచ్చింది చంద్ర బాబు సీనియార్టీకి మాత్రమేనని, అవినీతికి కాదని విమర్శించారు.
మొత్తంగా బాబుతో తాను ఎందుకు విడిపోయిందీ చెప్పుకొచ్చారు.సేమ్ టుసేమ్.
బీజేపీతో తాను ఎందుకు విడిపోయిందీ చంద్రబాబు చెప్పినట్టే.తాను ఎందుకు టీడీపీకి దూరమైందీ పవన్ చెప్పాడు.
ఇక, ఈ క్రమంలో ఆయన ఒంటరిగానే పోరుకు సిద్ధమయ్యారు.అయితే, పవన్ ఒంటరిగా వెళ్లే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.పవన్ లబ్ధి పొందడం ఖాయమని అందరికీ తెలిసిందే.
ఇదే విషయంపై ఇటీవల వెల్లడైన సర్వేలోనూ కొంత దారి మళ్లించే ప్రయత్నం చేసినా.
వాస్తవం మాత్రం పవన్ తో చంద్రబాబుకు ఇబ్బంది కర పరిస్థితి మాత్రం ఉంటుంది.
!--nextpage
ఆయన నోరు తెరిస్తే.చంద్రబాబు కౌంటర్ ఇవ్వగలిగే స్థాయిలో లేక పోవడం ఇక్కడ గమనార్హం.
జగన్‌పై చేస్తున్న విధంగా అవినీతి ఆరోపణలు చేసేందుకు పవన్ విషయంలో బాబుకు అవకాశం లేదు.
అయితే, రాజకీయంగా సీనియార్టీ గురించి ఆయన కామెంట్లు చేసినా.తొలి రోజుల్లో చంద్రబాబు కూడా జూనియరే అయినా.
ప్రజలు పట్టం కట్టారు కదా? ఇప్పుడు కూడా అంతే.కాబట్టి ఈ విషయంలోనూ పవన్‌ను బాబు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మళ్లీ యూటర్న్‌పాలసీ తీసుకున్నారు.త్వరలోనే మళ్లీ పవన్‌తో చేతులు కలిపేలా.
చర్చలకు తెరదీయాలని, ఆయన ఏం కోరుకున్నా చేయాలని చూస్తున్నట్టు.తాజాగా అమరావతి వర్గాల నుంచి కథనం రావడం గమనార్హం.
ఇటీవల రెండుసార్లు స్వయంగా చంద్రబాబు.చెప్పిన మాటలను బట్టి.
తాము పవన్‌ను వెళ్లిపొమ్మనలేదని, ఆయనంతట ఆయనే వెళ్లిపోయారని తెలుస్తోంది.అంటే.
పవన్ ఎప్పుడొచ్చినా.మళ్లీ చేతులు కలిపేందుకు బాబు రెడీగా ఉన్నారనే తెలుస్తోంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి.
చూడండి ఎంత దారుణమో.. మహిళా పోలీస్‌పై దుండగుడి అరాచకం.. నెటిజన్లు ఫైర్..