పెద్దిరెడ్డి దెబ్బకు గిల గిల ? బాబుని భయపెడుతున్న కుప్పం ?

టిడిపి అధినేత చంద్రబాబు కు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో వరుసగా ఆయన గెలుస్తూ వస్తున్నారు.

అక్కడ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించకపోయినా గెలవడం ఆనవాయితీగా మారింది.అసెంబ్లీ ఎన్నికలే కాదు ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా టిడిపి అభ్యర్థి విజయం సాధిస్తూ వస్తున్నారు.

కానీ 2019 ఎన్నికల ఫలితాల తరువాత నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారింది.ఈ నియోజకవర్గంలో టిడిపి ని దెబ్బ కొట్టడమే ఏకైక లక్ష్యంగా అధికార పార్టీ వైసిపి టార్గెట్ చేసుకోవడం , ముఖ్యం గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గం పై ఎక్కువగా దృష్టి పెట్టి పెద్దఎత్తున టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు ఉండేలా చేశారు.

అలాగే ఆ పార్టీలోని అసంతృప్త నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకుని కీలకమైన పదవులు కట్టబెట్టారు.

      గతంలో ఎప్పుడూ లేనివిధంగా టిడిపి ఇక్కడ బాగా బలహీన పడింది ఆ ప్రభావమే కొద్ది నెలల క్రితం జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో బాగా కనిపించింది.

అక్కడ ఎన్నికల ఫలితం వైసీపీ ఖాతాలో పడింది.దీంతో చంద్రబాబుకు ఏం అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది.

ఈ వ్యవహారాలు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని గుర్తించిన బాబు గత మూడు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ, పార్టీ లో ఇబ్బందికర పరిస్థితులను తొలగించేందుకు , నాయకులను యాక్టిివ్  చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం టిడిపి నాయకుల పైనే కాకుండా,  ఈ నియోజకవర్గంలో ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    """/"/   ప్రభుత్వ పథకాలు ఇళ్ల స్థలాలు అందించడం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండటం,  టిడిపి కంటే వైసీపీనే బెటర్ అన్న ఫీలింగ్ ప్రజల్లో కలిగేలా చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సక్సెస్ అవుతున్నారు.

టీడీపీలో బలమైన నాయకులను గుర్తించి వారిపై అనేక రకాలుగా ఒత్తిడి పెంచి టిడిపి లోనే ఉంటూ వైసిపికి సహకరించే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు.

ఇటువంటివి అన్నీ బాబుకు ఇబ్బందికరంగా మారాయి.

కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ సమీక్ష .. ఆ తొమ్మిది అంశాలు ఏంటి ?