నోరు జారుతున్న బాబు ... పరువుతీస్తున్న సోషల్ మీడియా !

కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు అని పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు.

సామాన్యులు నోరుజారిన పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ రాజకీయాల్లో ఉన్న ప్రముఖులు నోరు జారితే మాత్రం ప్రజల్లో నవ్వులపాలుకావల్సిందే.

ఫ్లో లో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే ఆ తరువాత నాలుక్కరుచుకున్నా ప్రయోజనం ఉండదు.

ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే .ఈ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు పదే పదే నోరుజారి అభాసుపాలవుతున్నాడు.

మీడియా లో అయితే ఆయన బయటకి రాకుండా జాగ్రత్తపడేవాడు కానీ సోషల్ మీడియా బాగా విస్తరించేయడంతో ఆ పప్పులు ఉడకడం లేదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ మధ్య చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల అర్థం అంతుపట్టడం లేదు.

ఆ మధ్య తిరుపతిలో బ్రిటీషోళ్లతోనే పోరాడిన పార్టీ అని ఆవేశంతో అన్నారు చంద్రబాబు.

దీంతో వారం రోజులు ఆయన సోషల్ మీడియాలో హల్ చేశారు.ఉప్పు సత్యాగ్రహంలో గాంధీతో, సుభాష్ చంద్రబోస్ తో సైనిక కవాతులో బాబు దిగిన చిత్రాలు బయటకొచ్చాయి.

ఇది చాలదన్నట్లు.నేషనల్ హైవే అథారిటీస్ వారికి వార్నింగ్ ఇస్తూ.

జాతీయ రహదారులను జాతీయం చేస్తానని హెచ్చరించారు.అంతటితో ఆగలేదు.

రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయని 10శాతం ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడంతో నవ్వులపాలు అయ్యారు.

సోషల్ మీడియాలో తాను అనుకున్నంత ప్రచారం రాకపోవడంతో.68 ఏళ్లు వయస్సున్న బాబు .

తాను 60 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకున్నారు.

అబ్బా.బాబుగారు.

అన్నప్రాసన రోజు నుంచే.నిజాం నవాబులు కూడా చేయలేనంతగా అభివృద్ధి కోసం ఎంత తపించారంటూ.

సోషల్ మీడియాలో జోకులు గట్టిగా పేలాయి.కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో చంద్రబాబు వేదిక పంచుకున్నారు.

తన విక్టరీ సింబల్ వదిలేసి హస్తంతో అభివాదం చేశారు.దీంతో చంద్రబాబు నాయుడు మెల్లిగా కాంగ్రెస్ చంద్రముఖిలా మారిపోతున్నారని సోషల్ మీడియాలో మార్పింగ్ ఫొటోస్ తో పోస్ట్లు తిరుగుతున్నాయి.

ఇక బాబు పుత్రరత్నం లోకేష్ మీద వస్తున్న పంచ్ లు మాములుగా ఉండడంలేదు.

మీడియాలో ఉన్నంత గ్రిప్ సోషల్ మీడియాలో లేకపోవడం టీడీపీకి పెద్ద మైనెస్ .

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య