కందుకూరుకు చంద్రబాబు.. బాధిత కుటుంబాలకు పరామర్శ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరుకు వెళ్లారు.నిన్నటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు.
ఇందులో భాగంగా ఓగూరులోని గడ్డం మధు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు.మృతునికి నివాళులర్పించిన చంద్రబాబు బాధిత కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు.
అనంతరం పరిహారం చెక్కును అందజేశారు.నిన్న చేపట్టిన కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి10, శుక్రవారం 2025