హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కంటి పరీక్షల నిమిత్తం మరికాసేపటిలో హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్నారు.

ఇప్పటికే చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.ఈ క్రమంలో ఇవాళ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల అనంతరం కంటికి ఎప్పుడు ఆపరేషన్ చేయాలనే అంశంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

స్కిన్ అలర్జీతో పాటు ఇతర సమస్యలపై రెండు రోజులపాటు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే.

విడుదలైన బన్నీ… భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి!