ఏపీ హైకోర్టుకు వెళ్లనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించనున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు హైకోర్టుకు వెళ్లనున్నారు.ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

కాగా ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు.

ఈ క్రమంలోనే మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో చంద్రబాబుకు ప్రత్యేక వసతి కల్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా ఆయనకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని సూచించారు.

బాలినేని కౌంటర్ :  చెవిరెడ్డి అవి బయటపెట్టమంటారా ?