TDLP Meeting : నేడే టీడీఎల్పీ సమావేశం .. ఆ పది అంశాలే కీలకం

ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) సిద్ధం సభలతో పార్టీ నాయకుల్లో జోష్ పెంచుతూ.

జనాల్లోకి దూసుకు వెళ్తుండడం, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుగానే అభ్యర్థులను జగన్ ప్రకటిస్తుండడం, అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వంటి అన్ని అంశాలను సీరియస్ గా తీసుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైసీపీకి ధీటుగా జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను , గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు కొన్ని అమలు కాకపోవడంతో వాటిని హైలెట్ చేసి జనాల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటోంది.

దీనిలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలతో టిడిఎల్పి సమావేశాన్ని( TDLP Meetting ) ఈరోజు సాయంత్రం 5.

30 కి అమరావతి లోని టిడిపి కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యవహాల పైన ఎమ్మెల్యేలకు చంద్రబాబు( Chandrababu Naidu ) సూచనలు చేయనున్నారు.

"""/"/ అలాగే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు( TDP MLAs 0 ముఖ్యంగా 10 అంశాలపై చర్చించాలని చంద్రబాబు సూచనలు చేయబోతున్నట్లు సమాచారం.

ముఖ్యమైన అంశాల్లో వైసిపి ప్రభుత్వంను ఇరుకున పెట్టే విధంగా చేయడంతో పాటు, అమలు కానీ హామీలపై గట్టిగానే నిలదీయాలని చంద్రబాబు సూచించబోతున్నారు.

రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి( Rajya Sabha Election Candidate ) పైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

వాస్తవంగా రాజ్యసభ అభ్యర్థి విజయానికి సరిపడా ఎమ్మెల్యేలు టిడిపికి లేకపోయినా, పోటీలో ఉంటే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు.

"""/"/ ఈ అంశం పైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.

ఈనెల 6న వైసిపి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్( Vote Account Budget ) ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, అసెంబ్లీలో ఏవిధంగా వ్యవహరించాలనే విషయం పైన చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయబోతున్నారట.

వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!