జనసేన ర్యాలీకి బాబు మద్దతు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత దాని కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో జనసేన పార్టీ తలపెట్టిన వైజాగ్‌ ర్యాలీకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ప్రభుత్వంకు పట్టదా అంటూ ప్రశ్నిస్తూ జనసేన ర్యాలీ సాగబోతుంది.

పవన్‌ కళ్యాణ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులను ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు.

భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వాలంటూ నిన్న స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఫోన్‌లో చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

పవన్‌ విజ్ఞప్తికి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు.తెలుగు దేశం పార్టీ పూర్తి మద్దతును ర్యాలీకి ఇవ్వబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు.

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు ముఖ్య నాయకులు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు.

రెండు ప్రధాన పార్టీలు చేయబోతున్న ఈ ర్యాలీతో ప్రభుత్వం దిగిరాక తప్పదు అంటూ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి.దాంతో కార్మికులు ఉపాది లేక అల్లాడి పోతున్నారు.

ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.