ఎడిటోరియల్ : బాబు మేల్కొవాల్సిందే .. భరోసా కల్పించాల్సిందే ?

టిడిపి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.పార్టీలోని నాయకులు ఏ ఒక్కరిలోనూ, భవిష్యత్తుపై భరోసా కనిపించడంలేదు.

ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అధికార పార్టీ, ఏ వైపు నుంచి, ఏ రకంగా తమను ఇబ్బంది పెడుతుందో తెలియక సతమతమైపోతున్నారు.

అసలు పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.ఇప్పుడు ఎక్కడికక్కడ టిడిపి నాయకులు టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

దీనికి తోడు గత ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలను బయటకి తీస్తూ, కేసులు నమోదు చేస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ వస్తోంది.

ఈ తరుణంలో పార్టీ తరఫున పోరాటాలు చేస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు టిడిపి నాయకులు ఎవరూ సాహసించలేకపోతున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు కూడా వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా, పదేపదే పార్టీ నాయకులను వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిందిగా ఆదేశాలిస్తూ రావడం, ఆ పోరాటాలకు ఆర్థికంగా అండదండలు అందించకపోవడం, మరో వైపు పార్టీని, నాయకుల రాజకీయ భవిష్యత్తుకి భరోసా కల్పించకపోవడం, భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియకపోవడం, ఒకవేళ పార్టీ కోసం సొమ్ములు ఖర్చు పెట్టినా, పార్టీ పుంజుకోకపోతే అప్పుడు భారీగా నష్టపోవాల్సి వస్తుందనే అభిప్రాయంతో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది వెనకడుగు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

"""/"/ అదీ కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు మొండి వైఖరితో ముందుకు వెళుతూ, పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తూ, ప్రభుత్వంపై కక్ష సాధించాలని చూస్తున్నారని, దాని ఫలితంగా అధికార పార్టీకి ఏం కాకపోయినా, టిడిపి ఆ పార్టీ నాయకులే భారీగా నష్టపోతున్నారు అనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన.

అమరావతి వ్యవహారాన్ని చూసుకుంటే జగన్ మూడు రాజధానుల విషయంలో ఎంతో క్లారిటీగా ఉన్నారు.

దీనికి కేంద్రం కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తోంది.మొదట్లో అమరావతి ఉద్యమానికి మద్దతు పలికినట్లుగా కనిపించినా, ఆ తర్వాత ఏపీ రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోమని పరోక్షంగా జగన్ కు జై కొడుతున్నట్టుగా ప్రకటించేసింది.

జగన్ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఏదో ఒక రూపంలో అమలు చేసి చూపిస్తాడనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.

అయినా అమరావతి అంటూ హడావుడి చేస్తున్నారు.దీనికి కారణంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీ పుంజుకునే పరిస్థితి లేదని, అలాగే తాము ఈ ప్రాంతంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి కనిపించడం లేదని టిడిపి నాయకులు వాపోవడమే కాక, క్షేత్రస్థాయిలో పరిణామాలు బాబు ముందు పెట్టినా, వాటిని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ, ఇంకా పాత తరహాలోనే రాజకీయాలను నడిపించాలని చూస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.

ఒక వైపు జగన్ ప్రజల్లో బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తూ, పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే విధంగా చేయాల్సిన బాబు, ఈ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా వ్యవహరిస్తున్నారు అనేది తెలుగు తమ్ముళ్ల బాధ.

మరి ఈ బాధ నుంచి బాబు ఎప్పుడు గట్టెక్కిస్తాడో, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయో ?.

బాబు గారి నిర్ణయం :  ఏపీలో ఇసుక ఫ్రీ ఫ్రీ