చంద్రబాబును కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలి..: ఏపీ సీఐడీ

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

రాత్రి సమయంలో నంద్యాలకు తమ బృందాలు చేరుకున్నప్పటికీ చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ తెలిపారు.

ఈ మేరకు చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నట్లు ఏపీ సీఐడీ తెలిపారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పేర్కొన్నారు.

చంద్రబాబు హోదాను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నామని వెల్లడించారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.

550 కోట్ల స్కామ్ జరిగిందన్న సీఐడీ అడిషనల్ డీజీ ప్రభుత్వానికి రూ.371 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

ఫేక్ ఇన్వాయిస్ లతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లింపు జరిగిందన్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబును కస్టడీకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కుంభకోణం అన్నింటిలో చంద్రబాబుు ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది.

జ్వరం వచ్చినా సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న టాలీవుడ్ సెలబ్రిటీలు.. ఎవరంటే..?