పవన్ ప్యాకేజ్ తీసుకోకపోతే చంద్రబాబును ప్రశ్నించాలి..: మంత్రి సీదిరి

టీడీపీ అధినేత చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.

వ్యవస్థలను సైతం చంద్రబాబు మేనేజ్ చేయగలరని తెలిపారు.అమరావతిలో మాయా ప్రపంచాన్ని సృష్టించారన్న మంత్రి సీదిరి అది పెద్ద కుంభకోణమని ఆరోపించారు.

తాత్కాలిక సెక్రటేరియట్ కే రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారంటే ఎవరూ నమ్మరని మంత్రి సీదిరి పేర్కొన్నారు.

దోచుకోవడానికే రెండు బోగస్ కంపెనీలను చంద్రబాబు పెట్టారని ఆరోపించారు.చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం అని గతంలో ప్రధానమంత్రి మోదీనే చెప్పారన్న సంగతి గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు అవినీతిపై విచారణ చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు తప్పించుకోలేరన్న మంత్రి సీదిరి ఇది ఆరంభం మాత్రమేనని తెలిపారు.అన్నింటిపై స్పందించే దత్తపుత్రుడు పవన్ ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

పవన్ సపోర్ట్ చేసిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇదని వెల్లడించారు.నిజంగా పవన్ ప్యాకేజ్ తీసుకోకపోతే తన యజమానిని ప్రశ్నించాలని సూచించారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని ఆడించిన అడివి శేష్.. ఈ హీరో గ్రేట్ అంటూ?