ఇంటెలిజెన్స్ ... టీడీపీలో వైలెన్స్ ! దడ పుట్టిస్తున్నాయే !
TeluguStop.com
మేము రాష్ట్రానికి అంత చేసాం .ఇంత చేశాం అని గొప్పలు చెప్పుకుంటూ.
ఈ సారి అధికారంలోకి రాబోయేది మేమే అని ధీమా వ్యక్తం చేసిన ఏపీ అధికార పార్టీ టీడీపీ కి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి.
అందుకే టీడీపీ నాయకులకు గట్టిగానే క్లాస్ పీకుతున్నాడు పార్టీ అధినేత.దీనంతటికీ కారణం బాబు కి అందిన సర్వే రిపోర్ట్ లే కారణం అని తెలుస్తోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఎవరూ సరిగా కష్టపడటం లేదని….ఇలా అయితే గెలవడం కష్టం అని, ఎన్నికల్లో గెలవారు అనుకున్నవారిని మార్చేయడానికి కూడా తను వెనుకాడను అని చంద్రబాబు నాయుడు హెచ్చరించాడట.
అంతే కాదు ఇటీవల పార్టీ నేతలతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆగ్రహంతో ఊగిపోయారట.
బాబుకి ఇంత ఆగ్రహం రావడానికి కారణం కూడా ఉందట.ఇంటెలిజెన్స్ రిపోర్టులే చంద్రబాబు నాయుడులో అసహనాన్ని పెంచుతున్నాయనే మాట వినిపిస్తోంది.
వైఎస్ జగన్ పాదయాత్ర విషయంలో చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్స్‌కు ఫుల్ గా పని చెప్పాడు.
జగన్ పాదయాత్రకు స్పందన ఎలా ఉంది? జగన్ వెంట ఎవరెవరు నడుస్తున్నారు? ఎందుకు నడుస్తున్నారు? అనే అంశాల గురించి ఇంటెలిజెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ఆరా తీయిస్తున్నట్టుగా తెలుస్తోంది.
!--nextpage
గోదావరి జిల్లాలు గత ఎన్నికల్లో చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చాయి.ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాలే చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణం.
ఈ నేపథ్యంలో ఆ జిల్లాలపై వచ్చేసారి కూడా చంద్రబాబు బాగా ఆశలు పెట్టుకున్నాడు.
ఇలాంటి నేపథ్యంలో జగన్ పాదయాత్ర జిల్లాల్లోకి చేరే సమయానికి చంద్రబాబు నాయుడు దీనిపై మరింతగా కన్నేశాడని తెలుస్తోంది.
దీనిపై పూర్తి వివరాలను తెలుసుకున్నాడట చంద్రబాబు.ఈ నేపథ్యంలో బాబుకు అసహనం మొదలైందని అందుకే ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.
అసలే మిత్రులు ఎవరూ టీడీపీ కి లేరు కాబట్టి ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలి ఈ పరిస్థితుల్లో రిపోర్టులు కూడా ప్రతికూలంగా రావడం టీడీపీ అధినేతతో అసహనం పెంచుతోంది.