వైయస్ విజయమ్మ..షర్మిలపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం( Praja Galam ) రోడ్డు షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏని గెలిపించాలని సూచించారు.సంపాద సృష్టించి.

పేద వర్గాలను ఆదుకుంటామని పేర్కొన్నారు.ఇదే సమయంలో వైయస్ విజయమ్మ.

( YS Vijayamma ) ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైయస్ షర్మిలపై( YS Sharmila ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తల్లి కాంగ్రెస్.పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు.

కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఓ తల్లి చెప్పింది. """/" / ఇప్పుడు అదే తల్లి ఇద్దరికీ బొట్టు పెట్టి .

ఇద్దరినీ యుద్ధానికి పంపించింది.కొడుకుకి కూతురికి న్యాయం చెప్పలేని నువ్వు.

ఐదు కోట్ల ప్రజలకు ఏం న్యాయం చేస్తావో తల్లి చెప్పు అంటూ చంద్రబాబు పరోక్షంగా వైయస్ విజయమ్మపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య నేనే ఖండించా.ఇప్పుడు రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy ) సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది అంటూ ఆరోపించారు.

ఇదంతా వ్యతిరేక ఓటు చీల్చడానికి కుట్ర.పన్నాగం అంటూ విమర్శించారు.

రాష్ట్ర విభజన వల్ల ఎంతో నష్టపోయాం.ఇప్పుడు వాళ్ళ ఇంటిలో గొడవ రాజకీయంగా ఉపయోగించుకుంటూ షర్మిల, సునీత ఓట్లు చీల్చే కుట్రకి తెర లేపారని చంద్రబాబు ఆరోపించారు.

కాబట్టి అప్రమత్తంగా ఓటేయాలని ఎన్డీఏని గెలిపించాలని స్పీచ్ ఇచ్చారు.

రోడ్డుపై పిల్లలతో వెళ్తున్నారా.. అయితే సజ్జనార్ షేర్ చేసిన ఈ వీడియో చూడాల్సిందే..