రాజంపేట బహిరంగ సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో చంద్రబాబు( Chandrababu ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాజంపేటలో ప్రజా స్పందన అదిరిపోయిందని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి పై ప్రజలలో తిరుగుబాటు మొదలయ్యిందని వ్యాఖ్యానించారు.కిరణ్ కుమార్ రెడ్డి ( Kiran Kumar Reddy ) అనుభవం ఉన్న వ్యక్తి.

రాజకీయ నేపథ్యం కుటుంబం నుండి రావటం జరిగింది.ప్రజలనుండి వచ్చిన తిరుగుబాటే.

జగన్ నీ ఇంటికి పంపిస్తోంది.రాయలసీమలో అన్ని సీట్లు కూటమి గెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

"""/" / వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి అంతే.మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం చేస్తుంది.

ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి.కూటమి అధికారంలోకి వచ్చాక రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు.

ఈ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించలేదు.మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైన పెడతామని స్పష్టం చేశారు.

ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదు సంవత్సరాలలో.20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

అలాగే ఉద్యోగం వచ్చేవరకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు సంచలన హామీ ఇవ్వడం జరిగింది.

అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు మేలు చేస్తామని భరోసా ఇచ్చారు.

నాగ చైతన్య తండెల్ సినిమా వల్ల ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది…