పెదకూరపాడు ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నిర్వహిస్తున్న ప్రజాగళం సభ( Prajagalam Sabha ) నేడు పెదకూరపాడులో( Pedakurapadu ) జరిగింది.

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెదకూరపాడులో ఐటీ పార్క్ తీసుకొస్తానని తెలియజేశారు.ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ కంపెనీలు తీసుకొచ్చి వర్క్ ఫ్రం హోం విధానంలో ఉపాధి కల్పిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు.

యువతకు బంగారు భవిష్యత్తు కావాలంటే ఎన్డీఏకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదే సమయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగిస్తామని అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

అప్పట్లో తాను అధికారంలో ఉన్న సమయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు తోఫా ఇచ్చినట్లు గుర్తు చేశారు.

"""/" / తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు అనేక మంచి పనులు చేసినట్లు స్పష్టం చేశారు.

ఉర్దూ యూనివర్సిటీలో స్థాపించడంతోపాటు హజ్ హౌస్ లు, షాదీ ఖానాలు కట్టినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.సీఎం జగన్( CM Jagan ) ఐదు ఏళ్ల పాలన పీడ కల అని అన్నారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది.ముస్లింలపై అనేక అరాచకాలు జరిగాయి.

అధికారంలోకి రాగానే నదుల అనుసంధానం చేసి.ప్రతి ఎకరాకు నీళ్ళందిస్తా.

పేదలకు ఉచిత ఇసుక అందిస్తా.జనం భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసాయి.

రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.

అల్లుఅర్జున్ పాటకు రోడ్డుపై బైకర్లు డ్యాన్స్.. వీడియో వైరల్