అనంతపురం గుత్తి సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) "బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" అనే కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం తెలిసిందే.

అనంతపురం జిల్లాలో( Anantapuram ) ప్రారంభించిన ఈ కార్యక్రమం నిన్న కళ్యాణదుర్గంలో జరగగా నేడు.

గుత్తిలో( Gooty ) సాగుతోంది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పై( CM Jagan ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని రాష్ట్రాన్ని కాపాడటం కోసం అని స్పష్టం చేశారు.

జగన్ కు పోలీసులు, ధన బలం ఉండొచ్చు.ప్రజలే నా బలం, నా సైన్యం టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాలలో వెలుగులు తీసుకొస్తా.

సంపద సృష్టించే ప్రజలకు పంచే బాధ్యత తీసుకుంటా.రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి.

ఒక్క ఛాన్స్ అని మోసపోయాం.ఇచ్చేది పది రూపాయలు.

దోచేది వంద రూపాయలు. """/" / ఇసుక ధరలపై ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు.

ప్రజలు మాట్లాడే స్వేచ్ఛ కూడా హరించి వేస్తున్నారు.యువగళం( Yuvagalam ) ప్రజాగళంగా మారటంతో.

యువగళం వాలంటీర్లపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అయినా సరే పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో గుత్తి చెరువుకు( Gooty Lake ) నీళ్లు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు.

తెలుగుదేశం హయాంలో హంద్రీనీవా జలాలు తీసుకొచ్చాం.గొల్లపల్లి రిజర్వాయర్( Gollapalli Reservoir ) నిర్మించం.

కియా పరిశ్రమ( KIA ) తీసుకురావడం ద్వారా వేలమందికి ఉపాధి అవకాశాలు రావడం జరిగాయి.

టెక్నాలజీ ద్వారా మీ జీవితాలలో వెలుగులు తీసుకొస్తా అంటూ చంద్రబాబు గుత్తి "బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

పవిత్రమైన జలం అనుకుని తాగేశారు.. చివరికి అది ఏ వాటరో తెలిసి షాక్..?