పెన్షన్ల పంపిణీ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.మరో 40 రోజులు మాత్రమే సమయం ఉంది.

ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం సంచలనంగా మారింది.

ఈ పరిణామంపై అధికార పార్టీ నేతలు తెలుగుదేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే పెన్షన్ల పంపిణీ( Pensions Distribution ) విషయంలో ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేశారు.

విషయంలోకి వెళ్తే "రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే పేదల పింఛన్లను ఆపేయడం దారుణం.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత జగన్ రెడ్డి( YS Jagan ) 15 రోజుల్లో రూ.

13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు.అలాంటిది పేదలకు పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి అడ్డేమొచ్చింది? అంటే ఈ పింఛన్ డబ్బుల్నే తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నమాట.

""img Src=" "/ ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే.1వ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ ఎందుకు అందించలేదు? వాలంటీర్లను ఈసీ వద్దంటే 1.

26 లక్షల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా.వాళ్లతో ఒక్క రోజులో ఇంటి దగ్గరకే పింఛన్ తెచ్చి ఇవ్వొచ్చు.

అలా ఎందుకు చేయలేదు? వృద్దులు, వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలి.

అలాంటిది వాళ్ళనే 3 కిలోమీటర్ల దూరంలోని సచివాలయానికి మండుటెండలో రమ్మంటారా? ఇదేం నీచ రాజకీయం? ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చెయ్యాలి.

జగన్ రాజకీయ క్రీడలో వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడు.వాలంటీర్ల( Olunteers ) విషయంలో ఎన్డీయే కూటమికి స్పష్టత ఉంది.

మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది.వాళ్లకు ఇంతకన్నా మంచి భవిష్యత్తే ఉంటుంది.

కాబట్టి వాలంటీర్లు జగన్ మాటలు నమ్మొద్దు.వైసీపీ కోసం పని చేయొద్దు.

మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.రూ.

4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తాం.రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తాం" అని ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ కుదేలవుతున్నా కేటీఆర్ కు ఏం పట్టదా ?