రావులపాలెం “ప్రజాగళం” సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు "ప్రజాగళం"( Praja Galam ) పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రెండో విడత నేటి నుంచి మొదలైంది.ఈ క్రమంలో రావులపాలెంలో నిర్వహించిన "ప్రజాగళం" సభలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( AP State ) నష్టపోయిందని వ్యాఖ్యానించారు.ఏపీని గాడిలో పెట్టడానికే మూడు పార్టీలు జట్టుగా వచ్చాయని చంద్రబాబు తెలియజేశారు.
ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు.చేశారా.
? బాబాయ్ ను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్. """/"/
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే.
రానున్న ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.వందకు వంద శాతం మనమే గెలుస్తున్నాం.
అని చంద్రబాబు( Chandrababu ) వ్యాఖ్యానించారు.ఇక ఇదే సభలో తనని పశుపతి అంటూ సీఎం వైఎస్ జగన్ ( CM YS Jagan )కామెంట్లు చేయడంపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.
పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడిన శివుడని చెప్పుకొచ్చారు.తాను రాష్ట్రాన్ని కాపాడడానికే శివుడి అవతారం ఎత్తినట్లు తెలియజేశారు.
ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థను తమ వ్యతిరేకించడం లేదని అన్నారు.
వారు రాజకీయం చేయటానికి మాత్రమే నేను వ్యతిరేకం.వారు 50వేల రూపాయలు సంపాదించుకునే మార్గం నేను చూపిస్తా.
వైసీపీ పాలనలో అవినీతి పరిగింది ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అంటూ చంద్రబాబు రావులపాలెం "ప్రజాగళం" సభలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
మొండి దగ్గును సైతం మడతెట్టేసే మ్యాజికల్ డ్రింక్ ఇది..!