కుప్పం విషయంలో ఆ కామెంట్లు నమ్మోద్దు చంద్రబాబు క్లారిటీ..!!
TeluguStop.com
చంద్రబాబు కుప్పం పర్యటనలో బిజీగా ఉన్నారు.మూడు రోజుల పాటు చేపట్టనున్న ఈ పర్యటనలో మొట్ట మొదటి రోజు దేవరాజు పురం రోడ్డు షోలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు.నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ.ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి నియోజకవర్గానికి రావటం జరిగిందని స్పష్టం చేశారు.
మూడు రోజులపాటు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో ఇటీవల కొంతమంది తాను కుప్పం నియోజకవర్గం విడిచి పెడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో తన కుప్పం నియోజకవర్గాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇదే సమయంలో పార్టీ నాయకులు.పార్టీని విడిచిపెట్టినా గాని.
పార్టీ కార్యకర్తలు విడువ లేదని అన్నారు.అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా.
మళ్ళీ అధికారంలోకి వచ్చాక.20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుందని.
అన్నారు. పార్టీ కార్యకర్తల ఒంటిపై దెబ్బ పడితే తన ఒంటిపై పడిన దెబ్బ గానే భావిస్తాను అని చంద్రబాబు రోడ్ షో లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
"""/" /
కుప్పం మున్సిపాలిటీ అదేవిధంగా పంచాయతీ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయిన సమయంలో.వైసీపీ నాయకులు చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని విడిచి పెట్టేసినట్లే అంటూ గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీంతో తన తాజా పర్యటనలో వైసీపీ నాయకులు చేసిన కామెంట్లకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చినట్లయింది.
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను డామినేట్ చేస్తాడా..?