సీఎం జగన్ కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

నెల్లూరు టిడ్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు దిగారు.ఈ మేరకు సెల్ఫీలను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

చూడండి ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లంటూ పేర్కొన్నారు.ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్లని, నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు అంటూ తెలిపారు.

నాలుగేళ్లలో జగన్ కట్టిన ఇళ్లు ఎన్ని అని ప్రశ్నించిన చంద్రబాబు జవాబు చెప్పగలరా అంటూ పోస్ట్ చేశారు.

చైనాలో కదిలించే ఘటన.. 3 ఏళ్లుగా కవల సోదరిలా నటించిన అమ్మాయి!