జగన్ వృద్ధుడు అంటూ చంద్రబాబు సెటైర్లు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భయంకరంగా వర్షాలు కురవడంతో చిత్తూరు జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ఇటువంటి తరుణంలో వరద బాధితుల సహాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే బుధవారం టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది.

ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన బాధితులను పరామర్శించారు.చిత్తూరు జిల్లా తిరుచానూరులో పర్యటించిన క్రమంలో.

సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు.జగన్ ఒక వృద్ధుడు అని.

ప్రజల్లో తిరగలేక గాల్లో తిరుగుతూ వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టుకుంటూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తాగునీటి సంఘాలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈరోజు చెరువులు తెగ వా పొంగిపొర్లేయ్యావా.

? అని ప్రశ్నించారు.వైసిపి నాయకులు చెరువులను భూములను కబ్జా చేశారని వాళ్ళకి మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించలేదని.

టీడీపీ హయాంలో ఎటువంటి భూకబ్జా చెరువుల అక్రమ జరగలేదని.చంద్రబాబు వైసీపీ నాయకుల పై మండిపడ్డారు.

Coriander : అమ్మ బాబోయ్‌.. కొత్తిమీర‌ను ప‌చ్చిగా తిన‌డం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?