'బాబు' బాటలో ఆమె !

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాటలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పయనించబోతున్నారు.

తాజాగా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాన్ని ఎత్తివేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించారు.

శుక్రవారం మమత మాట్లాడుతూ చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.సీబీఐ బీజేపీ చెప్పినట్టు ఆడుతోందని మమత విమర్శించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు, సోదాలు చేసేందుకు సీబీఐకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి తప్పనిసరి.

అయితే కొంతకాలంగా సీబీఐ ప్రతిష్ట మసకబారుతూ వస్తోంది.దీంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.

ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర రంగ ఉద్యోగులపై దాడి చేసే అవకాశం సీబీఐకి ఉండదు.

చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టే.ఇక ఇదే అస్త్రాన్ని మమత కూడా తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు చూస్తున్నట్టు సమాచారం.

సీత లుక్ లో సాయిపల్లవిని చూసి మురిసిపోతున్న నెటిజన్లు.. భారీ బ్లాక్ బస్టర్ ఖాయమంటూ?