డేటా దొంగలు ఎవరో సాక్ష్యాలు దొరికాయి! చంద్రబాబు కీలక వాఖ్యలు!
TeluguStop.com
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా డేటా చోరీ వ్యవహారంపై సంచలన వ్వాఖ్యలు చేసారు.
తీదేపీ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్ధులని ప్రకటించే పనిలో వున్న చంద్రబాబు తాజాగా డేటా చోరీ వ్యవహారంపై చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అసలు డేటా చోరీకి పాల్పడిన దొంగలు ఎవరో బయటపడింది అని ఈ రో మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ దొంగల భాగోతం బయటపెడతా అని చంద్రబాబు కీలక వాఖ్యలు చేసారు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ వ్యవహారం రాజకీయంగా వేడిని రాజేసింది.
అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒకరి మీద ఒకరు డేటా చోరీ చేసింది మీరంటే మీరు అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.
మరో వైపు సిట్ విచారణ కూడా ఈ ఓట్ల తొలగింపు, డేటా చోరీ వ్యవహారంపై జరుగుతుంది.
మరో వైపు ఎన్నికల సంఘం కూడా ఓట్ల తొలగింపు వ్యవహారంపై చాలా సీరియస్ గా వుంది.
ఇలాంటి టైంలో డేటా దొంగలు ఎవరో తన దగ్గర ఆధారాలు వున్నాయని చంద్రబాబు చెప్పడం ఇప్పుడు రాజకీయాలలో సంచలనంగా మారింది.
రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఎలా గుద్దిందో చూడండి!