పోలవరం ఎంట్రీ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు..!!
TeluguStop.com
ఉభయగోదావరి జిల్లాలలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది.
చంద్రబాబు రోడ్ షోలకు మరియు సభలకు జనం భారీ ఎత్తున వస్తూ ఉండటంతో టీడీపీ కేడర్ లో జోష్ నెలకొంది.
అంతకుముందు కర్నూలు పర్యటనలో కూడా జనాలు పోటెత్తారు.పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు పోలవరం పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగిన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రాజెక్ట్ సందర్శనకి వచ్చిన చంద్రబాబుని పోలవరం ముఖద్వారం వద్దేనే పోలీసుల అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి.
నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ప్రాజెక్టును ఎందుకు సందర్శించకూడదు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని పోలీసులను చంద్రబాబు కోరాటం జరిగింది.
అయితే నక్సలైట్ల నుండి ముప్పు పొంచి ఉందని చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో చాలా సందర్భాలలో పోలవరం పర్యటించడం జరిగింది.అప్పుడు లేని ముప్పు ఇప్పుడు ఎలా ఉంటుంది అని పోలీసులను చంద్రబాబు నిలదీశారు.
పోలవరం సందర్శనకు తనని అనుమతించేదాకా కదిలే ప్రసక్తి లేదని అక్కడే కూర్చుని చంద్రబాబు నిరసన తెలపడంతో.
పోలవరం వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉంది.
జుట్టు రాలడం, చుండ్రు.. ఈ 2 సమస్యలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఇది..!