తారకరత్న పెద్దకర్మలో అలేఖ్యకు మాటిచ్చిన చంద్రబాబు.. అలా చేస్తానంటూ?

తారకరత్న మరణం తర్వాత అలేఖ్యారెడ్డి కుటుంబాన్ని తలచుకుని చాలామంది టెన్షన్ పడుతున్నారు.అలేఖ్యారెడ్డి, ఆమె పిల్లలు ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా జీవనం సాగించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు, నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే అలేఖ్యారెడ్డికి చంద్రబాబు మాటిచ్చారని ఆమె పొలిటికల్ కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోనున్నారని తెలుస్తోంది.

నిన్న తారకరత్న పెద్దకర్మ జరగగా భర్తను తలచుకుంటూ అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు.అలేఖ్యారెడ్డి పిల్లలతో చంద్రబాబు మాట్లాడగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెద్ద కూతురు నిష్కతో మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా తనకు సమాచారం ఇవ్వాలని తాను అండగా ఉంటానని చంద్రబాబు చెప్పారని సమాచారం.

"""/"/ అలేఖ్యారెడ్డికి చంద్రబాబు మేమున్నామని భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయాలపై ఆసక్తి ఉంటే తమ వంతు సహాయసహకారాలను అందిస్తామని చెప్పారని తెలుస్తోంది.

అలేఖ్యారెడ్డికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తాను చూసుకుంటానని ఆయన చెప్పినట్టు సమాచారం.

అలేఖ్యారెడ్డి మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదనే సంగతి తెలిసిందే.అలేఖ్య మీడియాతో మాట్లాడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పవచ్చు.

"""/"/ తారకరత్న మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అలేఖ్యారెడ్డి త్వరలో ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆమె ఎక్కువగా టెన్షన్ పడుతున్నారని సమాచారం అందుతోంది.పిల్లలను ప్రయోజకులను చేయాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అలేఖ్యారెడ్డికి నందమూరి కుటుంబం నుంచి అందరు హీరోల సపోర్ట్ అయితే ఉంది.రాబోయే రోజుల్లో కూడా ఈ సపోర్ట్ ఇదే విధంగా కొనసాగితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అలేఖ్యారెడ్డి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

అలేఖ్యా రెడ్డి రాజకీయాల్లోకి వస్తే విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీసులోనే లవర్‌ని వెతుక్కుంటే క్యాష్ రివార్డ్స్.. ఎక్కడంటే..