శవ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ?

రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే రాజకీయ నాయకులు మాత్రం ఒకరినొకరు ఆడిపోసుకోవడం, నోటికొచ్చినట్లుగా విమర్శించుకోవడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదట.

దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్దితులు ఇలాగే ఉన్నాయంటున్నారు.పదవులు లేకుంటే ప్రజా సేవ మాకొద్దు అనేలా ప్రవర్తిస్తున్న నేతలకు ప్రజలే తగిన గుణపాఠం నేర్పితే గానీ రాజకీయ ప్రక్షాళన జరగదనే విషయాన్ని ఓటర్లు గమనించాలంటున్నారట విశ్లేషకులు.

ఇదిలా ఉండగా ఏపీ మంత్రి ఆళ్ల నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసారట.

చంద్రబాబు తన పాలన సమయంలో ఏపీని బ్రష్టుపట్టించారని, రాష్ట్రం కరోనాతో అల్లాడుతుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లు జూమ్ మీటింగులంటు కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు.

ఇక బాబు మూడు గంటల పాటు చేసిన దీక్షలో సుష్టుగా తిని, తిన్నది అరిగేంత వరకు దీక్ష చేయడమే కాకుండా కరోనాతో మరణించిన వారిని అడ్డు పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చిచ్చరపిడుగుల క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ‘అతడు’ సీన్ వైరల్