టీటీడీపీపై చంద్ర‌బాబు న‌జ‌ర్‌.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా..?

చంద్ర‌బాబు నాయుడు ఏపీలో టీడీపీని న‌డిపించే క్ర‌మంలో పూర్తి స్థాయిలో అక్క‌డే ఇంకా స‌క్సెస్ కాలేక‌పోతున్నారు.

కానీ అప్పుడే తెలంగాణ మీద ఫోక‌స్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.తెలంగాణ‌లో తిరిగి పార్టీ పుంజుకునేలా చేయాల‌ని ఆలోచిస్తున్నారంట‌.

ఇందుకోసం గ‌తంలో అనుస‌రించిన వ్యూహాన్ని మ‌రోసారి ముందుకు తీసుకొచ్చే ప‌నిలో ప‌డ్డారు చంద్ర‌బాబు.

2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగ‌తి తెలిసందే.

అది బాగానే క‌లిసి వ‌చ్చింది.అయితే ఇప్పుడు మ‌రోసారి దీన్నే ఫాలో కావాల‌ని చూస్తున్నారు.

ఇందుకు నిద‌ర్శ‌నం చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న తెలంగాణ రాజ‌కీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఆంధ్రా రాజ‌కీయాల‌కు ప‌రిమితం అయిపోయిన సంగ‌తి తెలిసిందే.

అప్ప‌టి నుంచే ఆయ‌న పెద్ద‌గా తెలంగాణ రాజకీయాల‌పై ఫోక‌స్ పెట్ట‌ట్లేదు.కానీ ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక ఇప్పుడు దశాబ్దాలుగా టీడీపీలో ప‌నిచేసిన ఎల్.రమణను కేసీఆర్ లాగేసుకున్నారు.

దీంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. """/"/ బక్కని నర్సింలును తీసుకువ‌చ్చి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించినా పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది.

దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు రంగంలోకి దిగుతున్న‌ట్టు స‌మాచారం.కాగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇంకా టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని, కొంచెం క‌ష్ట‌ప‌డితే దాన్ని మ‌ళ్లీ సాధించుకోవ‌చ్చ‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఇక ఇప్పుడు త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండ‌టంతో పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఎందుకంటే రేవంత్ కూడా టీడీపీలో బ‌ల‌మైన నేత‌గా ఎదిగారు కాబ‌ట్టి ఇన్ డైరెక్టుగా అయిన స‌పోర్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

అదే జ‌రిగితే కాంగ్రెస్‌కు న‌ష్ట‌మ‌నే చెబుతున్నారు రాజకీయ నిపుణులు.చూడాలి మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో.

బాలయ్య ‘అఖండ 2’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు..?