రజినీకాంత్’కు సపోర్ట్ గా చంద్రబాబు.. శిఖరం లాంటి ఆయనపై అర్ధంలేని విమర్శలా?
TeluguStop.com
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుక విజయవాడలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
నటరత్న ఎన్టీఆర్ ( Sr NTR ) శత జయంతి వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.
ఈ వేడుకలో రజనీకాంత్ చంద్రబాబు, బాలయ్యను సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ గారిని పొగుడుతూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మరి ఈయన ఈ వేడుకకు హాజరవ్వడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ దుమారం రేగింది.
రజినీకాంత్ మీద వైసీపీ నేతలు( YCP Leaders ), ఎన్టీఆర్ గారి రెండవ భార్య లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈయనపై అలాంటి వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.అందుకే ఈయనను సపోర్ట్ చేస్తూ రజినీకాంత్ ను క్షమాపణ అడగాలని కోరుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు.
"""/" /
''అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.
అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం.
సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి.
"""/" /
వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.ఎవరినీ చిన్న మాట అనలేదు.
పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు.అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్ధంలేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు.
శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే.
నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి.జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి''.