Chandrababu Naidu : అన్ని ఫ్యామిలీలకు ఒకే టికెట్ బాబు ఫ్యామిలీకి మాత్రం నాలుగు.. ఇదేం న్యాయమంటూ?

ఏపీలో ఎన్నికలకు కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఉంది.వైసీపీ, టీడీపీ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు.

వైసీపీ, టీడీపీ నుంచి టికెట్లు దక్కని నేతలు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయించే సమయంలో ఒక ఫ్యామిలీకి ఒకే టికెట్ అంటూ వింత నిబంధనను పెట్టారు.

అయితే సొంత ఫ్యామిలీ విషయంలో మాత్రం చంద్రబాబు( Chandrababu ) ఈ నిబంధనను పాటించడం లేదు.

"""/" / బాబు తన కుటుంబానికి మాత్రం నాలుగు టికెట్లను కేటాయించడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం( Kuppam Assembly Constituency ) నుంచి పోటీ చేస్తున్నారు.

టీడీపీకి కుప్పం కంచుకోట కావడంతో ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తానని బాబు బలంగా నమ్ముతున్నారు.

చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్( Nara Lokesh ) మరోసారి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.

"""/" / గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని భావిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేయనుండగా బాలయ్య చిన్నల్లుడు భరత్( Bharath ) విశాఖ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు.

తమ కుటుంబానికి ఒక రూల్ ఇతరుల కుటుంబాలకు మరో రూల్ అనే విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

తన కుటుంబానికి నాలుగు టికెట్లు కేటాయించడం గురించి చంద్రబాబు ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.

మరోవైపు బీజేపీ, జనసేనలకు కేటాయించిన స్థానాల విషయంలో స్వల్పంగా మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

2024 ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు తన మార్క్ వ్యూహాలతో ముందుకెళ్తున్నారని సమాచారం.

టీడీపీ ( TDP )నేతలు ఇప్పటికే మేనిఫెస్టోను ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.

Telangana Student Dies In US Swimming Pool Accident