కూటమి గెలిస్తే ఇంట్లో ఒక్కరికే పథకమా.. బాబు షాకింగ్ షరతులు అలా ఉండబోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు( Chandrababu )ఇచ్చిన హామీల ప్రకారం పథకాలను అమలు చేయాలంటే 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అంత డబ్బులు ఖర్చు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు.

మరి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.

కూటమి మేనిఫెస్టోకు( Alliance Manifesto ) షాకింగ్ షరతులు ఉండబోతున్నాయని ఆ షరతులు సైతం సామాన్యుల ఊహలకు అందని విధంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం స్కీమ్ అమలు కానుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డ్( White Ration Card ) నిబంధన కూడా ఉండనుందని సమాచారం అందుతోంది.

"""/" / ఇంట్లో ఎంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా ఒకరికి మాత్రమే 20,000 రూపాయలు ఇచ్చేలా అన్నదాత స్కీమ్ ( Annadata Scheme )ఉండబోతుందని తెలుస్తోంది.

లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేలా కూటమి ప్లాన్స్ ఉన్నాయని ఆ షరతుల గురించి చెబితే ఓట్లు రావని కూటమి నేతలు సైలెంట్ గా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాబు మాటలు నీటి మీద రాతలు అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. """/" / ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేకపోతే ఏ పథకానికి ఎలాంటి షరతులు ఉండబోతున్నాయో కూటమి నేతలు క్లియర్ గా క్లారిటీ ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కఠినమైన షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తామంటే ఓటర్లు అస్సలు అంగీకరించే అవకాశాలు ఉండవు.

కూటమి నుంచి ఎన్నికల సమయానికి ఈ ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

వైసీపీ హామీలు ఇప్పటికే అమలు చేసిన హామీలు కావడంతో కొత్త షరతులు అయితే ఉండబోవని ప్రచారం జరుగుతోంది.

కూటమి, వైసీపీ మేనిఫెస్టోలలో అసలు వాస్తవాలను ఓటర్లు అర్థం చేసుకుంటే మంచిది.

బాబీ బాలయ్య తో చేస్తున్న సినిమా ఆ సూపర్ హిట్ సినిమాకి కాపీ గా రానుందా..?