బాబు తిరుగులేని శక్తిగా మారుతాడా .. ఎలా ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుంది.ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని .

మళ్ళీ తమ అధికార పీఠం దక్కించుకోవాలని విరామమే లేకుండా బాగా కష్టపడుతున్నాడు.అందుకే అందివచ్చిన ప్రతి అంశాన్ని తమ పార్టీ గెలుపు కోసం వాడేసుకునే పనిలో పడ్డాడు.

దీంతో పాటు ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ.పరిస్థితి ఎలా ఉంది .

? ఇంకా ప్రజలు తమ నుంచి ఏమి కోరుకుంటున్నారు.? ఇంకా ఏమి చేస్తే.

పార్టీకి కలిసి వస్తుంది అనే విషయం పై ఆరాతీసే పనిలో పడ్డాడు బాబు.

ఒకవైపు చూస్తే.ఏపీలో ఎన్నికలకు ఇంకా .

మూడు నెలలు మాత్రమే సమయం ఉంది.ఫిబ్రవరి చివరివారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు.దీంతో ఈ నెలలోనే పూర్తిస్థాయి వరాలను ప్రకటించి అమలు చేసే పనిలో పడ్డాడు బాబు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చంద్రబాబు బాగా కష్టపడి పనిచేస్తూ.అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు అనే భావన ప్రజల్లో ఉన్నా.

సిట్టింగ్ ఎమ్యెల్యేలు.స్థానిక నాయకుల అవినీతి వ్యవహారాలు మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆ ఎఫెక్ట్ పార్టీ మీద పడుతోంది.

ఈ విషయం ఇప్పటికే బాబు కి అనేక రిపోర్ట్స్ అందడంతో పరిస్థితిని చకాదిద్దే పనిలో పడ్డాడు.

అందుకే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సిట్టింగులకు సీటు కట్ చేయాలనే ఆలోచనలో బాబు ఉన్నాడు.

ప్రజల్లో బాబు కి మాత్రం ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.అయితే ఎమ్మెల్యేల అవినీతి కారణంగా చంద్రబాబు పై ఉన్న నమ్మకం కూడా ఏమాత్రం పనిచేస్తుందన్నది సందేహమే.

అందుకే ఇప్పటికే వివిధ వర్గాలను చంద్రబాబు ప్రసన్నం చేసుకోగలిగారు.నిరుద్యోగ భృతిని అమలు చేసి యువతకు దగ్గరయ్యారు.

తాజాగా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి పెద్దలతో హీరో అనిపించుకుంటున్నాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కిందిస్థాయి నాయకుల అవినీతి వ్యవహారాలు ఎలా ఉన్నా.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమని గట్టెక్కిస్తుందని బాబు ధీమాగా ఉన్నాడు.అయితే తమ నుంచి ఎటువంటి లోపం లేకుండా .

గత ఎన్నికల ముందు ఇచ్చి మర్చిపోయిన అన్ని వాగ్ధానాలను అమలు చేసి మరింత చేరువ అవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు.

ముఖ్యంగా.రుణమాఫీ.

రైతులకు మేలు చేసే ఈ హామీని సక్రమంగా అమలు చేయలేకపోయామని భావనలో బాబు ఉన్నాడు.

ఈ విషయంలో .రైతులు ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉన్నారని, విడతలు వారీగా రుణమాఫీ అమలు చేయడం వల్ల రైతులకు ఉపయోగం ఏమీ లేదని తేలడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యాడు బాబు.

ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు మరిన్ని సంక్షేమ పథకాలకు పదునుపెట్టి మరింత ముందుకు వెళ్లాలని అది కూడా.

ఈ నెలాఖరులోగా చెయ్యాలని బాబు కృతనిశ్చయంతో ఉన్నాడు.

అల్లు అర్జున్ టీ గ్లాస్ స్టెప్పు పై అనసూయ షాకింగ్ కామెంట్స్!