Chandrababu Naidu : వాలంటీర్ల పై ఆంక్షలు : కోరి ముప్పు తెచ్చుకోవడం అంటే ఇదేగా బాబు ?

ఏపీ రాజకీయాల్లో( AP Politics ) పోటాపోటీ వాతావరణం నెలకొంది.వైసీపీ పై టిడిపి.

జనసేన.బిజెపిలో మూకుమ్మడిగా ఎదురు దాడికి దిగుతున్నాయి.

వైసీపీకి కలిసి వచ్చే అన్ని అంశాల పైన ఆ పార్టీలు ఫోకస్ చేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

దీనిలో భాగంగానే వైసిపికి ప్రత్యక్షంగా.పరోక్షంగా సహకారం అందిస్తున్న వాలంటీర్ల విషయంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం టిడిపి కూటమికి ఇబ్బందికరంగా మారబోతోంది.

వాలంటీర్ల పైన ఎన్నికల సంఘం ఆంక్షలను విధించింది.పెన్షన్లను వాలంటీర్లు( Volunteers ) ప్రతి నగదు రూపంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈసీ నిర్ణయంతో వాలంటీర్లు ఆ సేవలను కొనసాగించేందుకు అవకాశం లేకుండా  ఆంక్షలను విధించింది.

పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవలసిందిగా ఈసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ప్రభావంతో దాదాపు 66 లక్షలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాస్తవంగా ఎప్పటి నుంచో వాలంటరీ వ్యవస్థపై రాజకీయంగా వివాదం చోటుచేసుకుంది.

"""/"/ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) తో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు వాలంటీర్ల విషయంలో అనేక సందర్భంలో చులకనగా మాట్లాడడం వంటివి చోటు చేసుకున్నాయి.

పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసు కూడా నమోదయింది.తాజా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ( Citizens For Democracy ) ఈ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వాలంటీర్లను ఉపయోగించరాదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

"""/"/ ఎన్నికల కోడ్( Election Code ) ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయవద్దని ఉత్తర్వ్యూల్లో పేర్కొంది.

దీంతో ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దాదాపు 66.

4 లక్షల మందికి వృద్ధాప్య, సామాజిక, ,వికలాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అందిస్తున్నారు.

ఈ సేవలను వైసీపీ హైలెట్ చేసుకొని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది.ఈ వ్యవస్థ ద్వారా తమకు ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడతాయని ఉద్దేశంతో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) నిమ్మకట్ట రమేష్ కు చెందిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారనే విషయాన్ని హైలెట్ చేస్తూ వైసీపీ ప్రజల్లోకి వెళ్ళింది.

ఈ ప్రభావంతో రాజకీయంగా టిడిపి కి ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా ఈ  వ్యవహారం పై వైసీపీ అనేక విమర్శలు చేస్తోంది.చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకం అనే విషయం మరోసారి స్పష్టమైందని, పేదలపై గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా వైసీపీ( YCP ) ఆరోపిస్తోంది.

ఏది ఏమైనా వృద్దులు, వికలాంగులకు తమ ఇంటివద్దే పెన్షన్ తీసుకునే సదుపాయాన్ని లేకుండా టీడీపీ చేసిందనే విషయాన్ని వైసీపీ జనాల్లోకి తీసుకువెళ్లి, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై మరింత ఆదరణ, టీడీపీ ఓటమిపై వ్యతిరేకత పెంచే దిశగా వైసీపీ ప్రయత్నిస్తూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

చర్మం నలుపును తగ్గించే మార్గాలివి.. అస్సలు మిస్ అవ్వకండి!