Chandrababu Naidu : సీట్ల ప్రకటనపై టిడిపి సీనియర్ల ఫైర్ .. బుజ్జగిస్తున్న బాబు

chandrababu naidu : సీట్ల ప్రకటనపై టిడిపి సీనియర్ల ఫైర్ బుజ్జగిస్తున్న బాబు

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) పార్టీ తరఫున పోటీ చేయబోయే 94 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

chandrababu naidu : సీట్ల ప్రకటనపై టిడిపి సీనియర్ల ఫైర్ బుజ్జగిస్తున్న బాబు

జనసేనకు( Janasena ) పొత్తులో భాగంగా 24 స్థానాలను కేటాయించగా, అందులో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

chandrababu naidu : సీట్ల ప్రకటనపై టిడిపి సీనియర్ల ఫైర్ బుజ్జగిస్తున్న బాబు

అయితే చంద్రబాబు ప్రకటించిన జాబితాలో చాలామంది సీనియర్ నాయకులకి చోటు కల్పించలేదు.దీనిపై టిక్కెట్ ఆశించి భంగ పడిన సీనియర్ నేతలంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

కొంతమంది బహిరంగంగానే దీనిపై విమర్శలకు దిగగా,  మరి కొంతమంది పరోక్షంగా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో,  సీనియర్లను తప్పించి యువ నాయకులకు,  వైసీపీ నుంచి వచ్చి చేరిన కీలక నేతలకు చంద్రబాబు అవకాశం కల్పించారు.

దీంతో ఇప్పటి వరకు నియోజకవర్గంలో తమకు తిరుగులేదని , తమదే సీటు అంటూ ధీమా గా ఉన్న వారంతా చంద్రబాబు ప్రకటనతో షాక్ కు గురయ్యారు.

"""/" / ఈ జాబితాలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు.దీంతో వారందరితోనూ ప్రస్తుతం చంద్రబాబు బుజ్జగింపులకు దిగుతున్నారు .

ఈ జాబితాలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్,( Alapati Rajendra Prasad )  పీలా గోవింద్,( Peela Govind ) దేవినేని ఉమ,( Devineni Uma )  బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు వంటి నేతలు ఉన్నారు.

వీరితో విడి విడి గా సమావేశం అవుతున్న బాబు పొత్తులో భాగంగా కొన్ని సీట్లను,  సర్వే నివేదికల  ఆధారంగా కొన్ని సీట్లను జనసేన కు ఖరారు చేసామని,  ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటూ బాబు నచ్చ చెబుతున్నారట.

"""/" / ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితా తరువాత చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అటువంటి నాయకులకు కీలక నేతలు టచ్ లోకి వెళ్లారు.చంద్రబాబుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని, నామినేటెడ్ పదవులు ఇస్తాము అంటూ బుజ్జగింపులు కు దిగుతూ వారి అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

నెలకి రూ.1 లక్ష పొదుపు.. లగ్జరీ తగ్గించుకోలేదు.. బెంగళూరు యువతి సేవింగ్స్ ప్లాన్ వైరల్..

నెలకి రూ.1 లక్ష పొదుపు.. లగ్జరీ తగ్గించుకోలేదు.. బెంగళూరు యువతి సేవింగ్స్ ప్లాన్ వైరల్..