ఆ... గ్లామర్ తో చంద్రబాబు కొత్త రాజకీయం ...?

సినీ గ్రామర్ ఎక్కువగా ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో సినీ జనాలకు విడదీయరాని అనుబంధం ఉంది.

అసలు ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి సినీ ప్రపంచంలో రారాజుగా వెలిగిన నందమూరి తారక రామారావు.

అందుకే మొదటి నుంచి టీడీపీకి చిత్రసీమకు చెందిన వ్యక్తుల మద్దతు కూడా ఎక్కువగా ఉంటూ వస్తోంది.

ఇప్పటికే టిడిపిలో ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆ రంగానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు.

అయితే ఏపీ - తెలంగాణ విడిపోయిన తరువాత క్రమంగా చిత్ర సీమకు చెందిన వ్యక్తుల మద్దతు కొంచెం తగ్గినట్టు కనిపిస్తుండడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వం కు ఏపీలో వ్యతిరేక గాలి ఇస్తుండడంతో మళ్లీ పార్టీకి ఫూనర్వైభవం వచ్చేలా.

సరికొత్త ఎత్తులు వేస్తున్నాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ విభజన తరువాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.

అయితే నాలుగున్నరేళ్లుగా ఏపీలో ఏం జరిగినా.చిత్ర పరిశ్రమ నుంచి యువ హీరోలు స్పందించలేదు.

ప్రత్యేక హోదా కోసం జనం రోడ్డెక్కిన సమయంలో కూడా ఇండ్రస్ట్రీ కి చెందిన కొందరు కమెడియన్లు జనాల్లోకి వచ్చి హోదా కోసం దీక్షలు చేశారు.

అయితే.కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు మాత్రం ఈవిషయంలో నోరెత్త లేదు.

దీనిపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు చెలరేగినా.ఇండ్రస్ట్రీ పెద్ద వ్యక్తులు అంతా సైలెంట్ గానే ఉండిపోయారు.

కానీ బాబు తెర వెనుక మంతనాల ప్రభావమో ఏమో కానీ.కొందరు యువ హీరోలు రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టారు.

చంద్రబాబుకు అండగా తమ గొంతు పెంచుతున్నారు.బాబు ఈజ్ గ్రేట్ అంటూ.

ప్రశంసలు కురిపిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.బాబు కి బద్ద శత్రువుగా మారిన ప్రధాని నరేంద్ర మోదీ మీద విమర్శలు చేయడంలో బాబు కి చేదోడు వాడుగా కొంతమంది యువ హీరోలు తయారయ్యారు.

ఇటీవల కియో కారును ప్రదర్శించిన సమయంలో ఇద్దరు యువహీరోలు అత్యుత్సాహంతో ప్రభుత్వం గ్రేట్ అంటూ పొడిగేశారు.

అయితే నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో సదరు హీరోలపై విమర్శలు చెలరేగాయి.నాలుగున్నరేళ్లుగా హోదా కోసం పోరాటం చేస్తుంటే ఏనాడు ఏసీ గది దాటి రాని మీరు, రాష్ట్రంలో మహిళా అధికారులను ఇసుకలో పడేసి కొట్టినా నోరెత్తని మీరు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎమ్మెల్యేలను కొంటుంటే అది తప్పు.

అని చెప్పలేని మీరు, ఇప్పుడు ఒక కారును ఆవిష్కరించగానే చప్పట్లు కొడతారా?.ఇన్నాళ్లకు నిద్ర లేచారా అంటూ .

నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కియో కారు ప్రదర్శన సందర్భంగా హీరో రామ్‌ చేసిన ట్వీట్‌కు కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

కులాభిమానంతో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ.విమరలు ఎదుర్కొన్నారు.

'మా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.లేదంటే మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో.

ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు' అంటూ మంచు మనోజ్ మోఢీ పై ట్విట్ చేసి వార్తల్లోకి ఎక్కారు.

ఇలా ఒక్కొక్కరుగా బాబు కి సపోర్ట్ గా రంగంలోకి దిగడంతో.బాబు మరింతమందిని రంగంలోకి దించి గట్టెక్కాలని చూస్తున్నాడు.

వైరల్ వీడియో: అర్ధరాత్రి కారును వెంబడించి.. ఆపై దాడి.