TDP Chandrababu Naidu : వాళ్లను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు.. ఐదేళ్లు పార్టీని నమ్ముకుంటే ఇలా చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 స్థానాల నుంచి టీడీపీ( TDP ) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మిగిలిన స్థానాలలో 21 స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుండగా 10 స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తోంది.

అయితే చాలా నియోజకవర్గాలలో పార్టీ కోసం కష్టపడిన అభ్యర్థులకు టికెట్లు దక్కలేదు.మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ( Janasena,BJP ) వల్ల టికెట్లు దక్కని నేతలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఐదేళ్లు పార్టీని నమ్ముకుంటే అన్యాయం జరిగిందని చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా టీడీపీ మూడో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ మూడో జాబితా ఆశావహుల్లో చాలామందికి అధిష్టానం మొండి చేయి చూపించింది.

"""/"/ పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గౌరవం ఇవ్వడంతో పాటు వాళ్లను బుజ్జగించి వాళ్లకు భవిష్యత్తులోనైనా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

టీడీపీకి కార్యకర్తలు, నేతలే( TDP Leaders ) బలం.2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా పార్టీని నమ్ముకుని పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడిన నేతలు చాలామంది ఉన్నారు.

వైసీపీ( YCP )లో టికెట్ దక్కని నాయకులను సీఎంవోకు పిలిచి నచ్చజెబుతున్నారు.వైసీపీ కోసం కష్టపడి, సర్వేలలో అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరికీ టికెట్ దక్కింది.

అయితే టీడీపీలో మాత్రం పొత్తు వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. """/"/ ఏపీలో ఎన్నికలకు( AP Elections ) కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఉచిత హామీలను మాత్రమే నమ్ముకుంటే టీడీపీ విజయం సాధించడం సులువైన విషయం కాదు.

చంద్రబాబు( Chandrababu Naidu ) కొన్ని ఏరియాలలో పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వడంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ఎన్నికలలో గెలుపు కోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.

మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.

పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా..?