బాబు దెబ్బకి కాంగ్రెస్ అవాక్కయింది

చంద్రబాబు అంటేనే ఎత్తులకు పైఎత్తులు వేసి చాణక్యుడిగా రాజకీయ వర్గాల్లో పెద్ద పేరే ఉంది.

ఆయన ఎప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ ఎలా మాట్లాడుతారు ఎటువంటి వ్యూహాలు రచిస్తారో ఎవరికీ అంతుపట్టదు.

ఒక రాజకీయవేత్తగా విశ్లేషకుడిగా, అపారమైన రాజకీయ అనుభవం గడించిన చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎదుర్కోవడానికి తెరవెనుక వ్యూహాలను సిద్ధం చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు.

ఒకపక్క తెలంగాణలో ఎన్నికల విషయంలో తనదైన శైలిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలో దిగుతున్న తెలుగుదేశం అధినేత ,ఇప్పుడు ఏపీలో అధికారం చేజారిపోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలంగాణలో కాంగ్రెస్ కూటమి లో చేరిన చంద్రబాబు ఆ తరువాత ఢిల్లీలో రాహుల్ ని కలిసి శాలువా కప్పి సత్కరించి, చేయి చేయి కలిపి మేమంతా ఒక్కటే అన్నట్టుగా సంకేతాలు పంపారు.

చంద్రబాబు మద్దతు తెలిపారని కాంగ్రెస్ చంకలు గుద్దుకుంటున్న తరుణంలో నిన్నటి రోజున చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు.

కర్ణాటకలో సీఎం కుమారస్వామి ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ తో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ కి దిమ్మ తిరిగిపోయేలా చేసాయ్.

అదేంటంటే దేశంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా సరే గద్దె దించాలని, అందుకు మూడో కూటమి రాక తప్పదని, ఇదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తుందని చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం షాక్ తింది.

అంతేకాదు మూడో కూటమి అంటే అనేక ప్రాంతీయ పార్టీల కలయిక అని దేవ గౌడ్ వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంలో సీఎం కుమారస్వామి మాట్లాడుతూ 1996 సమయంలో దేశంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పుకొచ్చారు.

అయితే ఆ సంవత్సరంలో కాంగ్రెస్ మద్దతిస్తే ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాయి.అంటే కాంగ్రెస్ ఈసారి కూడా ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం తప్ప ప్రధాన పాత్ర పోషించే అవకాశం లేదనేది నిన్నటి చంద్రబాబు కర్ణాటక టూర్ లో అర్థమయ్యింది Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఒకపక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు మరోపక్క కర్ణాటకలో థర్డ్ ఫ్రంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పెద్దలు నోళ్లు వెళ్లబెట్టారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఉద్దేశంతో పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడు చంద్రబాబు తాజా వ్యూహాలతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట.

ఎన్నికలు ముగిసేలోగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఇంకెన్నిషాకులు ఇస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

స‌మ్మ‌ర్ లో బాడీ హీట్ ను మాయం చేసే టాప్ అండ్ బెస్ట్ ఫుడ్స్ ఇవే!