బాబు నమ్మాలంటే …? బీజేపీ ఇలా చేయాల్సిందేనట

ప్రస్తుతం ఏపీలో పొత్తుల వ్యవహారమే హాట్ టాపిక్ మారింది.బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే.

మొదటి నుంచి టిడిపి( TDP ) విషయంలో దూరం పెడుతూనే వచ్చినా, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలతో టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి సిద్దమయింది.

అయితే ఎక్కడా ఈ పొత్తుల అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు బహిరంగంగా మాట్లాడడం లేదు.

తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా పరిశీలన చేస్తున్నారు.ఇక బిజెపితో పొత్తు వ్యవహారం పైన పార్టీ నేతలు ఎవరు స్పందించవద్దని, ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేసిన చంద్రబాబు ఈ సందర్భంగా జగన్( YS Jagan Mohan Reddy ) అవినీతిపై చర్యలు ఎప్పుడూ తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక అంశాల్లో అవినీతి భారీగా చోటు చేసుకుందనే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగలోకి దిగి, నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

"""/" / జగన్ అవినీతి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర అధికార పార్టీ బిజెపి అయినా, ఆ పార్టీ పరోక్షంగా ఏపీ ప్రభుత్వం కి మద్దతు ఇస్తుండడం వంటి వ్యవహారాలపై చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు.

ఒకపక్క పొత్తుల వ్యవహారంపై చర్చలు జరుగుతుండగానే మరో పక్క ఏపీ ప్రభుత్వానికి నిధులు కేంద్రం నుంచి విడుదల అవ్వడం వంటివి చంద్రబాబుకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

"""/" / ముఖ్యంగా ఏపీలో మద్యం వ్యవహారంతో పాటు, ఇసుక అక్రమ రవాణా, ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవినీతి వంటి వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే నిజా నిజాలు ఏమిటో బయటకు వస్తాయని ఈ విషయంలో బిజెపి దూకుడుగా వ్యవహరిస్తేనే ఏపీలో వైసిపి ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడతాయని, రాబోయే ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన లు పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్లినా, ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయంతో చంద్రబాబు( Chandrababu Naidu ) ఉన్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం అవినీతి వ్యవహారాలపై కేంద్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోనే, జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారనే బాధ చంద్రబాబు లో ఉంది.

అందుకే ఈ వ్యవహారాలపై బిజెపిని చంద్రబాబు ప్రశ్నిస్తూ, వైసిపి ప్రభుత్వం పై చర్యలు తీసుకునే విధంగా పదేపదే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

తరచూ స్వీట్స్ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!