వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం.. చంద్రబాబు ఇచ్చిన హామీతో కూటమికి తిరుగులేదా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) వాలంటీర్లకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే హామీ ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన చంద్రబాబు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు.

చంద్రబాబు ఇచ్చిన హామీతో కూటమికి తిరుగులేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. """/" / వైసీపీ వైపు నుంచి వాలంటీర్లకు బెనిఫిట్ కలిగేలా ఇలాంటి హామీ లభించలేదు.

ప్రస్తుతం వాలంటీర్లకు 5750 రూపాయల వేతనంతో పాటు పేపర్ కొనుగోలు చేయడానికి అదనంగా 200 రూపాయల గౌరవ వేతనం అందుతోంది.

ప్రస్తుతం పొందుతున్న వేతనంతో పోల్చి చూస్తే రెట్టింపు వేతనం పొందే అవకాశం అంటే వాలంటీర్లకు ఇది నిజంగానే బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు.

గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఈ ప్రకటన విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఉగాది పండుగ రోజున చేసిన ప్రకటనతో చంద్రబాబు వాలంటీర్ల నోరు తీపి చేశారనే చెప్పాలి.

ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం.జగన్( CM Ys Jagan ) వైపు నుంచి ఇదే తరహా హామీ లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

జగన్ వాలంటీర్ల గౌరవ వేతనం పెంచని పక్షంలో వైసీపీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

"""/" / చంద్రబాబు( Chandrababu Naidu ) ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తూ పార్టీ అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారు.

వాలంటీర్ల విషయంలో చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం చంద్రబాబు మరోమారు సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

అయితే జగన్ దెబ్బకు బాబు దిగొచ్చాడంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో గెలవాలని ఇష్టానుసారం హామీలను ప్రకటిస్తున్నారని ఆ హామీలను అమలు చేయడం మాత్రం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కూటమి అధికారంలోకి వస్తే బాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో చూడాల్సి ఉంది.

జైలు బయట అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకుడు..(వీడియో)