తారక్ పెళ్లి వెనుక చంద్రబాబు ప్రమేయం లేదా.. వల్లభనేని వంశీ ఏమన్నారంటే?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెళ్లి జరగడానికి చంద్రబాబు కారణమని చాలామంది భావిస్తారు.
తారక్ లక్ష్మీప్రణతి అన్యోన్యంగా ఉండటంతో పాటు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒక జోడీగా ఈ జోడీ ఉందనే సంగతి తెలిసిందే.
అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలలో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయంలో కూడా ఎవరి పాత్ర లేదని కామెంట్లు చేశారు.
చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు.తారక్ కు అమరావతికి సంబంధం ఏంటని వల్లభనేని వంశీ ప్రశ్నించారు.
అమరావతి రైతులను పొలాలు ఇవ్వమని తారక్ ఏమైనా అడిగారా అంటూ వల్లభనేని వంశీ కామెంట్లు చేయడం గమనార్హం.
తారక్ గురించి ఈ మధ్య కాలంలో అమరావతి రైతులు కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ విమర్శల గురించి వల్లభనేని వంశీ స్పందిస్తూ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
తన గురించి ఎన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నా తారక్ మాత్రం ఆ కామెంట్లను అస్సలు పట్టించుకోవడం లేదు.
విమర్శల గురించి స్పందించడం వల్ల అనవసర వివాదాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని తారక్ భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్లు తారక్ అభిమానులను సైతం ఒకింత హర్ట్ చేశాయనే సంగతి తెలిసిందే.
"""/" /
తారక్ కొత్త సినిమాకు సంబంధించి సెట్ వర్క్స్ త్వరలో మొదలుకానున్నాయని బోగట్టా.
దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రానుంది.దర్శకుడు కొరటాల శివ తన సినీ కెరీర్ లో ఏ సినిమా కోసం కష్టపడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడ్డారు.
ఈ సినిమా పూర్తైన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీ కానున్నారు.
వీడియో: నెటిజన్లను నవ్విస్తున్న ఎలాన్ మస్క్ రోబో.. తడబడుతూనే నడక నేర్చుకుంటోందిగా..?