కనిపించని చంద్రబాబు.. పోలీసు కేసు నమోదు

ఏపీ రాజకీయాల్లో రోజూ వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి.సామాన్య ప్రజలకు వీటిని పట్టించుకునేంత తీరిక లేకపోవడంతో వారి పనుల్లో వారు బిజీగా ఉంటారు.

అయితే కుప్పంలోని ప్రజలు మాత్రం ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఏపీ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కనబడటం లేదనే వార్త ప్రస్తుతం అక్కడ హల్‌చల్ చేస్తోంది.

దీనికి తోడు స్థానిక వైకాపా నేతలు ఇదే విషయంపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

కుప్పం ప్రజల కష్టాలను చంద్రబాబు నాయుడు ఏనాడూ పట్టించుకోవడం లేదంటూ, తమ గోడును వెల్లబుచ్చుకుందామని బాబు దగ్గరకు వెళితే ఆయన అత్తాపత్తా లేకుండా పోతున్నారని కుప్పం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడున్నర దశాబ్దాల నుండి కుప్పం నుండి ఎన్నికల్లో విజయం సాధిస్తున్న చంద్రబాబు నియోజకవర్గంలో వెలగబెట్టింది ఏమీ లేదంటూ అక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

అటు అమరావతి పరిధిలోని వైకాపా నేతలు పలువురు కనిపించడం లేదంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో, కుప్పంలో బాబుపై ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మరి ఈ విషయం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

మణిరత్నం చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్న నందమూరి బ్రహ్మిని…