ఇక లోకేష్ పాత్ర పరిమితమే ? అలా సెట్ చేసిన బాబు ?

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు హడావుడి నడుస్తోంది.మొన్నటి వరకు ఆయన కుమారుడు లోకేష్ ప్రభావం ఎక్కువగా కనిపించేది.

చంద్రబాబు ఇంటికే పరిమితమైన సమయంలో లోకేష్ రాష్ట్ర పర్యటనలు చేస్తూ, పార్టీ కేడర్ లో జోష్ నింపేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు.

పార్టీలో ఇకపై అంతా తానే కీలకం అన్నట్లుగా వ్యవహారాలు చేస్తూ కనిపించారు.అయితే ఇప్పుడు ఎక్కడా లోకేష్ హడావుడి కనిపించడం లేదు.

కేవలం మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే అప్పుడప్పుడూ ఆయన పర్యటిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా టిడిపిలో కీలకంగా వ్యవహరించే విషయంలో అంతగా ఉత్సాహం చూపించడం లేదు.

దీనికి కారణం టిడిపి అధినేత చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమేనట.      ఇప్పటి నుంచే లోకేష్ ను ప్రమోట్ చేసుకోవడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు జనాల్లోకి వెళ్తే తేడా వస్తుందని, మొదటికే మోసం వస్తుందని సందేహంలో బాబు ఉన్నారట.

అందుకే లోకేష్ పాత్రను పరిమితం చేయడం ఒక్కటే మార్గం గా బాబు డిసైడ్ అయ్యారట.

ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు కి , ఆయన కుటుంబానికి అవమానం జరగడం,  తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

    """/"/    ఇక ఆ తర్వాత నుంచి లోకేష్ సైలెంట్ అయిపోగా  చంద్రబాబు యాక్టివ్ గా ఉంటున్నారు.

ప్రస్తుతం బాబు కుప్పం నియోజకవర్గం పై పూర్తిగా దృష్టి పెట్టారు ఇక్కడ పార్టీని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.

అదే సమయంలో మంగళగిరి నియోజకవర్గం పై పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ 2024 ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న దానిపైన దృష్టిపెట్టాలని, బాబు లోకేష్ కు సూచించారట.

అందుకే లోకేష్ అంత యాక్టిివ్ గా కనిపించకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

ఊరుకుంటే లాభం లేదనుకున్నారేమో ..! ఈ క్లారిటీ చాలా ?